కుళ్లిన కోడిగుడ్ల పంపిణీ.. అంగన్వాడీ కేంద్రంపై గ్రామస్తుల ఆగ్రహం.

కుళ్లిన కోడిగుడ్ల పంపిణీ.. అంగన్వాడీ కేంద్రంపై గ్రామస్తుల ఆగ్రహం.

వేలేరు, జులై 04 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామంలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారురాలికి పంపిణీ చేసిన కోడిగుడ్లు కుళ్లిపోయినవిగా ఉండటంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది. ఇంటికి తీసుకెళ్లి గుడ్లను పగులగొట్టగా అవి పూర్తిగా పాడై ఉండటాన్ని గమనించిన మహిళ అధికారుల నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే పౌష్టికాహార నాణ్యతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్ల నాణ్యతను క్రమం తప్పకుండా తనిఖీ చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .