రామన్నపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

రామన్నపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

వరంగల్, ఆగస్టు 15 (తెలంగాణ ముచ్చట్లు): 

గ్రేటర్ వరంగల్ 29వ డివిజన్ రామన్నపేటలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, సమన్వయకర్త తాళ్లపల్లి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సరిహద్దు భద్రతా దళం మాజీ ఉద్యోగి సయ్యద్ ఫసిద్దిన్ హుస్సేన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తిని చాటుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కొడకండ్ల సదాంత్, 29వ డివిజన్ అధ్యక్షుడు పూజారి కుమారస్వామి, ఇజ్జగిరి భీమ్రాజ్, భరతపు సంజీవ్, గొర్రె అరుణ్, ఉప్పరపల్లి రమేష్, రాధిక, సమత, సంధ్య, పుష్ప, గొల్ల రాజయ్య, సీనియర్ పాత్రికేయుడు వెంకన్న, కాపర్ బోయిన శ్యామ్, రాగం సురేష్, బోరిగం రాములు, కాపరుబోయిన రవి, కాపర్ బోయిన ప్రేమ్, పెద్దపెళ్లి రాజు, సమ్మయ్య, కృష్ణ, సాగర్ తదితరులు పాల్గొన్నారు.IMG-20260815-WA0090.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .