ముల్కనూరులో అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం.

ముల్కనూరులో అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం.

భీమదేవరపల్లి, ఆగస్టు 12 (తెలంగాణ ముచ్చట్లు)

ముల్కనూరు గ్రామానికి చెందిన మద్ది నర్సమ్మ (65) అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. ఈ నెల 9న ఇంటి నుంచి బయటకు వెళ్లిన నర్సమ్మ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, ఇరుగుపొరుగు వారిని ఆరా తీశారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో ఆమె కుమారుడు మద్ది అజయ్ ఈ నెల 10న ముల్కనూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో బుధవారం ముల్కనూరు ఎంసీఆర్‌బీ బ్యాంకు వెనుక ఉన్న చెట్ల పొదల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. పోలీసులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని పరిశీలించగా, అది అదృశ్యమైన మద్ది నర్సమ్మ మృతదేహంగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.మృతదేహం సమీపంలో పురుగుల మందు డబ్బా లభించడంతో ఆమె పురుగుల మందు సేవించి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News