ఆగస్టు 11న ఇందిరాపార్క్ వేదికగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల మహా ధర్నా.
ఖాజా హుస్సేన్, ఎన్ హెచ్ ఎం జిల్లా కోఆర్డినేటర్ .
వనపర్తి,ఆగస్టు08(తెలంగాణ ముచ్చట్లు):
హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వేదికగా ఈ నెల 11వ తేదీ (మంగళవారం) ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల రాష్ట్రవ్యాప్త మహా ధర్నాను విజయవంతం చేయాలని వనపర్తి జిల్లా ఎన్‌హెచ్‌ఎం కోఆర్డినేటర్ ఖాజా హుస్సేన్ పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల క్రమబద్ధీకరణ (రెగ్యులరైజేషన్) ప్రధాన డిమాండ్‌తో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో ఈ మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వారి సేవలను గుర్తించి రాష్ట్రంలోని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరినీ ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.ఈ మహా ధర్నా పూర్తిగా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందని, రాష్ట్రంలోని 78 క్యాడర్లకు చెందిన సుమారు 17 వేల మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు.వనపర్తి జిల్లాలోని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహా ధర్నాను విజయవంతం చేయాలని ఖాజా హుస్సేన్ కోరారు. అలాగే ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, వైద్య సంఘాలు, మీడియా ప్రతినిధులు, ప్రజలు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు సంఘీభావం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.


Comments