ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.1.20 లక్షల ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.1.20 లక్షల ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.

వేలేరు, ఆగస్టు 8 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండల కేంద్రానికి చెందిన సింగం కేదారి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రూ.1,20,000 ఎల్ఓసీ మంజూరు చేయించారు.
హనుమకొండలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, కడియం శ్రీహరి,సింగం కేదారికి రూ.1.20 లక్షల ఎల్ఓసీ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి, సర్పంచ్ బిల్లా యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News