శిశు సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలే అమృతం.
పెద్దమందడి,ఆగస్టు04(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మంగంపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను అంగన్‌వాడీ టీచర్ నారాయణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ నారాయణమ్మ తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో తల్లిపాల పాత్రపై గర్భిణులు, బాలింతలు, తల్లులకు అవగాహన కల్పించారు.జననం నుంచి తొలి ఆరు నెలల వరకు శిశువులకు తల్లిపాలు మాత్రమే అందించడం ద్వారా వారికి అవసరమైన సంపూర్ణ పోషకాహారం లభిస్తుందని నారాయణమ్మ వివరించారు. తల్లిపాలు శిశువులలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడతాయని తెలిపారు. తల్లిపాలను సరైన సమయంలో, క్రమం తప్పకుండా అందించడం ద్వారా శిశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమేష్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కృష్ణవేణి, అంగన్‌వాడీ టీచర్ నారాయణమ్మ, ఆయా, గర్భిణులు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.


Comments