జర్నలిస్టులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

జర్నలిస్టులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

*ఇళ్ల స్థలాలు, పెండింగ్ బీమాపై హామీ.. అవసరమైతే ఎంతవరకైనా పోరాడతానని స్పష్టం*

హుజురాబాద్,ఆగష్టు 2(తెలంగాణ ముచ్చట్లు ):

జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్‌లో జరిగిన టీయూడబ్ల్యూజే సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు మంజూరైన ఇళ్ల స్థలాల విషయంలో కాంగ్రెస్ నాయకులు కోర్టులో కేసులు వేసి వాటిని అడ్డుకున్నారని మండిపడ్డారు. జర్నలిస్టులకు రావాల్సిన ఇళ్ల స్థలాలను తిరిగి ఇప్పించేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.
అలాగే, జర్నలిస్టులకు పెండింగ్‌లో ఉన్న బీమా నగదును అవసరమైతే తన సొంత ఖర్చులతో చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు

Tags:

Post Your Comments

Comments

Latest News

పరామర్శలతో ప్రజలకు అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. పరామర్శలతో ప్రజలకు అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
  బాధిత కుటుంబాలకు ఓదార్పు – ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా హుజురాబాద్,ఆగష్టు 2(తెలంగాణ ముచ్చట్లు ): హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ సభలో రావుల వేణుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కితాబు.
స్నేహ బంధానికి ప్రపంచం వందనం.
వేంసూరు టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం.
జర్నలిస్టులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి.
భూ వివాదం ఉద్రిక్తం.. దంపతులపై దాడి జరిగిందని ఆరోపణ.