అభివృద్ధి బాటలో చండ్రుగొండ–అన్నపురెడ్డిపల్లి.

అభివృద్ధి బాటలో చండ్రుగొండ–అన్నపురెడ్డిపల్లి.

- రూ.1.25 కోట్ల పనులకు శ్రీకారం.
- ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలతో సందడి.

అశ్వారావుపేట, జూలై 30 (తెలంగాణ ముచ్చట్లు): 

అశ్వారావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార–పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి గురువారం చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో విస్తృతంగా పర్యటించి రూ.1.25 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందజేసి గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చండ్రుగొండ మండలంలోని మంగయ్యబంజార గ్రామంలో రూ.45 లక్షలతో గ్రావెల్ రోడ్డు, కల్వర్టు, సీసీ రోడ్డు, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదే సందర్భంగా గ్రామానికి అదనంగా 24 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. పొకలగూడెంలో రూ.60 లక్షలతో నిర్మించిన నాలుగు అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించగా, రావికంపాడులో రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం అన్నపురెడ్డిపల్లి మండలంలోని భీమునిగూడెం గ్రామంలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయ భవనం, సీసీ రోడ్లు, లో-లెవల్ కాజ్వేను ప్రారంభించారు. కొత్తూరు, నర్సాపురం, ఎర్రగుంట గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయగా, ఊటుపల్లి, రాజాపురం గ్రామాలతో పాటు పలు ప్రాంతాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ సంక్షేమాన్ని ప్రజల గడపకు చేర్చుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, రూ.500 బోనస్ వంటి పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించి అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, పేదల అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ ధ్యేయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మిగిలిన అంతర్గత రహదారులు, ఇతర అభివృద్ధి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ విర్రబాబు, మున్సిపల్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు, జిల్లా ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.IMG-20260730-WA0059

Tags:

Post Your Comments

Comments

Latest News

పామిడిరెడ్డిపల్లిలో ఓటరు దరఖాస్తుల ప్రక్రియ విజయవంతం. పామిడిరెడ్డిపల్లిలో ఓటరు దరఖాస్తుల ప్రక్రియ విజయవంతం.
పెద్దమందడి,జూలై30(తెలంగాణ ముచ్చట్లు): ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిడిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన ఓటరు దరఖాస్తులను బూత్‌వారీగా 100% శాతం పూర్తి చేసిన...
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.
పదోన్నతి ఉద్యోగులకు కొత్త ఉత్సాహం.
రైతులు నీటి నిల్వకుంటలు ఏర్పాటు చేసుకోవాలి.
ఎమ్మెల్యే రాగమయి ప్రత్యేక దృష్టి.. ఎస్‌ఐఆర్‌లో సత్తుపల్లికి గుర్తింపు.
వెల్టూర్ లో బీఎల్‌ఓల కృషి,ప్రజల సహకారంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతం.
కుదించిన ప్రింట్ మీడియా వార్త ఇలా ఉంటుంది: