ఓటరు జాబితాలో ఒక్క అర్హుడూ మిస్ కాకూడదు: దేశిని కోటి.
జమ్మికుంట టౌన్ జూలై 28 (తెలంగాణ ముచ్చట్లు):
రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటరు జాబితా నమోదు ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేశిని కోటి అధికారులకు, పార్టీ శ్రేణులకు సూచించారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 19వ, 4వ వార్డులకు చెందిన పోలింగ్ బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు)తో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దేశిని కోటి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పోలింగ్ బూత్ పరిధిలో ఒక్క అర్హుడి పేరు కూడా మిస్ కాకుండా ఇంటింటి సర్వే నిర్వహించి, ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.
కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల పేర్లను తప్పనిసరిగా నమోదు చేయడంతో పాటు, ఓటరు జాబితాలోని తప్పులు, చిరునామా మార్పులు, ఇతర సవరణలను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు పరస్పర సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో వార్డు బూత్ అధ్యక్షులు మడిపోజు రాజేష్, ఆడెపు దేవరాజ్, శివతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments