సామాజిక న్యాయం కోసం బహుజన సేన పిలుపు .

సామాజిక న్యాయం కోసం బహుజన సేన పిలుపు .

ఎల్కతుర్తి, జూలై 25 (తెలంగాణ ముచ్చట్లు):

సామాజిక న్యాయం, రిజర్వేషన్ల పరిరక్షణే లక్ష్యంగా జూలై 26న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న రిజర్వేషన్ డే సభను విజయవంతం చేయాలని బహుజన సేన పిలుపునిచ్చింది. ఈ మేరకు ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామ అంబేద్కర్ కూడలి వద్ద శనివారం కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ మాట్లాడుతూ, ఛత్రపతి సాహుజి మహారాజ్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సభలో రిజర్వేషన్ల పరిరక్షణ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దళిత క్రైస్తవుల సమస్యలు, పూలే–సాహుజి–అంబేద్కర్ ఆశయాలపై విస్తృత చర్చ జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కవులు, కళాకారులు, సామాజిక ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.
రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కీలకమని పేర్కొన్న ఆయన, రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులు, మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మొలుగురు రమేష్, ఉపసర్పంచ్ మేకల బాబు, వార్డు సభ్యుడు మారుపాక రవీందర్, పొన్నాల వినోద్ కుమార్, మేకల కిషన్, మణుగూరు జేమ్స్, గడిపే ప్రశాంత్, మేకల శంకర్, మణుగూరు భాస్కర్, మేకల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సూరారంలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి. సూరారంలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.
ఎల్కతుర్తి, జూలై 25 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామ శివారులో రిలయన్స్ గ్యాస్ ప్లాంట్ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్‌లో...
నీట్ బాధితులకు కొవ్వొత్తుల నివాళి.
సామాజిక న్యాయం కోసం బహుజన సేన పిలుపు .
శివారాధనతో పుణ్యమయమైన తొలి ఏకాదశి .
ఎల్‌నినో ప్రభావం ...ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి
ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి.
తొలి ఏకాదశికి శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో భక్తజన సందోహం.