మద్దిగట్ల- మోజర్ల పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై పోలీసులు అవగాహన.

మద్దిగట్ల- మోజర్ల పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై పోలీసులు అవగాహన.

పెద్దమందడి,జూలై25(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం మద్దిగట్ల- మోజర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై పోలీసులు అవగాహన  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైనర్ బాలురు వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, గంజాయి తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, వాటికి సంబంధించిన చట్టపరమైన శిక్షలపై విద్యార్థులకు వివరించారు.ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు మాట్లాడుతూ.. పాఠశాల పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసుల సహకారం కోరారు. పోలీసు అధికారులు విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, చట్టాలను గౌరవించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సూరారంలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి. సూరారంలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.
ఎల్కతుర్తి, జూలై 25 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామ శివారులో రిలయన్స్ గ్యాస్ ప్లాంట్ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్‌లో...
నీట్ బాధితులకు కొవ్వొత్తుల నివాళి.
సామాజిక న్యాయం కోసం బహుజన సేన పిలుపు .
శివారాధనతో పుణ్యమయమైన తొలి ఏకాదశి .
ఎల్‌నినో ప్రభావం ...ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి
ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి.
తొలి ఏకాదశికి శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో భక్తజన సందోహం.