విద్యా సేవలకు గౌరవ వందనం.

ప్రధానోపాధ్యాయుడు సుధాకర్‌కు ఘన సన్మానం.

విద్యా సేవలకు గౌరవ వందనం.

జమ్మికుంట టౌన్ జులై 24 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట పట్టణ ప్రభుత్వ బాలికల పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా విశిష్ట సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన సుధాకర్‌ను శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పాల్గొని పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, సుధాకర్ విద్యారంగానికి అందించిన సేవలు చిరస్మరణీయమైనవని, ఆయన నిబద్ధతతో కూడిన బోధన, క్రమశిక్షణ, విద్యార్థుల పట్ల చూపిన అంకితభావం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. ఆయనతో కలిసి గడిపిన అనుబంధ క్షణాలు ఎప్పటికీ మరచిపోలేనివని పేర్కొన్నారు.
ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఆయన అనుభవం, సూచనలు, సలహాలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ముఖ్యంగా యువతకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. సుధాకర్ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పలువురు ప్రముఖులు పాల్గొని సుధాకర్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.

Tags:

Post Your Comments

Comments

Latest News