ఈశ్వరమ్మపై వ్యాఖ్యలు ఖండనీయం.. కేశబోయిన అశోక్ యాదవ్ ఆగ్రహం.
జక్కిడి శివచరణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్.
హుజురాబాద్ , జూలై 12(తెలంగాణ ముచ్చట్లు ):
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలు, యాదవుల పెద్దమ్మగా పేరొందిన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌పై తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ చేసినట్లు ఆరోపిస్తున్న వ్యాఖ్యలను యాదవ విద్యావంతుల వేదిక జిల్లా నాయకుడు కేశబోయిన అశోక్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా అశోక్ యాదవ్ మాట్లాడుతూ, యాదవ సమాజానికి గౌరవనీయురాలైన ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. యాదవుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే సమాజం సహించబోదని హెచ్చరించారు.
జక్కిడి శివచరణ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా యాదవ సంఘాలతో కలిసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. యాదవ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘాల నాయకులు, యువజన ప్రతినిధులు, మహిళా నాయకులు, వివిధ మండలాల యాదవ సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈశ్వరమ్మకు మద్దతు ప్రకటిస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలను ఖండించారు.


Comments