భీమదేవరపల్లి సర్పంచ్ మాచర్ల కుమారస్వామికి బీజేపీ సిద్ధిపేట జిల్లా ఉపాధ్యక్ష పదవి.

భీమదేవరపల్లి సర్పంచ్ మాచర్ల కుమారస్వామికి బీజేపీ సిద్ధిపేట జిల్లా ఉపాధ్యక్ష పదవి.

భీమదేవరపల్లి, జూలై 1, తెలంగాణ ముచ్చట్లు : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు  ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న "సంఘటన్ పర్వ్" కార్యక్రమంలో భాగంగా బీజేపీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ నూతన జిల్లా కార్యవర్గాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ కార్యవర్గంలో భీమదేవరపల్లి మండలానికి చెందిన సర్పంచ్ మాచర్ల కుమారస్వామి నీ సిద్ధిపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ అవకాశాన్ని కల్పించిన కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ , రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు , జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ భీమదేవరపల్లి మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన మాచర్ల కుమారస్వామి మాట్లాడుతూ, ఇది కేవలం బాధ్యత కాదు... నాపై పార్టీ ఉంచిన నమ్మకం. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలవడానికి, ప్రజలకు అందుబాటులో ఉంటూ అంకితభావంతో పనిచేస్తాను అని తెలిపారు.IMG-20260711-WA0014
ఈ నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న జన్మదిన వేడుకలు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న జన్మదిన వేడుకలు.
హుజురాబాద్, జూలై 11(తెలంగాణ ముచ్చట్లు ): హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర...
భీమదేవరపల్లి ప్రభుత్వ పాఠశాలకు రూ.50 వేల విలువైన వాటర్ కూలర్ విరాళం.
ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు.
ఉమ్మడి జిల్లా స్థాయి స్మారక కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం.
హుజురాబాద్‌లో పెట్రోల్ బంక్ వద్ద అగ్నిప్రమాదం.
కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు కల్పించాలని కాంగ్రెస్ అభిమానుల విజ్ఞప్తి.
ఘనంగా చిల్డ్రన్స్ పార్లమెంట్ వార్షిక దినోత్సవం.