సత్తుపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల.

సత్తుపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల.

సత్తుపల్లి, జూన్‌ 21(తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సత్తుపల్లి పట్టణం, మండల పరిధిలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ప్రముఖ వైద్యుడు, తన సన్నిహితుడు డాక్టర్ కూసంపూడి నరసింహారావును పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని సదాశివునిపాలెంలో ఆళ్ల రత్నవాసు కుమారుడు అభిరాం–ప్రియా చంద్రిక వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తర్వాత సత్తుపల్లి పట్టణంలోని ఎంఆర్ గార్డెన్స్‌లో జరిగిన డాక్టర్ ఉడతనేని వెంకటేశ్వరరావు–డాక్టర్ లలితకుమారి మనుమడి నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ప్రారంభమైన న్యూ స్టార్ చిల్డ్రన్స్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను కూడా మంత్రి సందర్శించారు. ఆస్పత్రి యాజమాన్యాన్ని, డాక్టర్ సురేష్ రామాలను అభినందిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, మున్సిపల్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.IMG-20260621-WA0166

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .