వేలేరు గ్రామానికి రూ.45 లక్షల నిధులు మంజూరు.
Views: 57
On
వేలేరు, జూన్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మేజర్ గ్రామంలోని సీసీ రోడ్ల అభివృద్ధి కోసం మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి రూ.45 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ మేరకు ప్రొసీడింగ్స్ కాపీని వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి, ఏఎంసీ డైరెక్టర్ కత్తి సంపత్లకు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ, గ్రామంలోని సీసీ రోడ్ల సమస్యలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి రూ.45 లక్షల నిధులను మంజూరు చేశారని తెలిపారు.
గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఆయన సహకారంతో వేలేరు గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని సర్పంచ్ బిల్లా యాదగిరి పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments