ఆగారం వాటర్ ట్యాంక్ నుంచి వృథాగా నీటి ప్రవాహం.. పట్టించుకోని అధికారులు.

ఆగారం వాటర్ ట్యాంక్ నుంచి వృథాగా నీటి ప్రవాహం.. పట్టించుకోని అధికారులు.

ఖిల్లా ఘనపూర్,జూన్15(తెలంగాణ ముచ్చట్లు):

ఖిల్లా ఘనపూర్ మండలం ఆగారం గ్రామంలోని తాగునీటి వాటర్ ట్యాంక్ నుంచి నీరు భారీగా లీకై వృథాగా పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ప్రతిరోజూ విలువైన తాగునీరు వృథా అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వాటర్ ట్యాంక్‌ను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.ట్యాంక్ పరిసరాల్లో పరిశుభ్రత లేకపోవడం, లీకేజీలను సకాలంలో నివారించకపోవడం వల్ల నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని వారు పేర్కొంటున్నారు.కలుషిత నీరు సరఫరా అయితే గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి సమస్యలను గుర్తించి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నదని ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వాటర్ ట్యాంక్ లీకేజీని అరికట్టి, మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చెల్పూర్ పీహెచ్‌సీలో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ. చెల్పూర్ పీహెచ్‌సీలో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ.
హుజురాబాద్,జూన్ 16(తెలంగాణ ముచ్చట్లు ): కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ శ్రీరాం, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రభుదాస్‌తో కలిసి చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య...
బలీదుపల్లిలో అవినీతి ఆరోపణలు అవాస్తవం.. సర్పంచ్, రైతులు, మహిళల స్పష్టీకరణ.
గ్రామాల అభివృద్ధికి సహకరించాలి: ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరిన సర్పంచ్‌లు.
చిన్నారుల విద్యా భవిష్యత్తుకు శ్రీకారం చుట్టిన మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని మనోజ్ రావు.
అక్రమ మొరం తరలింపు.. ట్రాక్టర్, జేసీబీ స్వాధీనం.
దమ్మపేటలో రూ.1.20 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం!