రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన చందా రాజుకు ఘన సన్మానం.
Views: 3
On
జమ్మికుంట టౌన్ జూన్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన చందా రాజును జమ్మికుంట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆర్యవైశ్య యువజన సంఘం (ఆవోపా) అధ్యక్షుడు, కమిటీ సభ్యులు మరియు సంఘ ప్రతినిధులు కలిసి ఆయనకు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో ఆర్యవైశ్య సమాజ అభివృద్ధి, సంక్షేమం కోసం చందా రాజు మరింత సమర్థవంతంగా పనిచేసి విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించి సమాజానికి మరింత చేరువ కావాలని శుభాకాంక్షలు తెలిపారు.
సన్మాన కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, ఆవోపా కమిటీ సభ్యులు, ప్రముఖులు, సంఘ పెద్దలు పాల్గొని చందా రాజుకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమం ఆప్యాయ వాతావరణంలో జరిగింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments