రైతు సేవలకు పెద్దపీట.. జమ్మికుంట మార్కెట్ కమిటీ సమావేశంలో నిర్ణయాలు.

ఇల్లంతకుంట, వీణవంకలో ఉప మార్కెట్ యార్డుల నిర్మాణం .

రైతు సేవలకు పెద్దపీట.. జమ్మికుంట మార్కెట్ కమిటీ సమావేశంలో నిర్ణయాలు.

జమ్మికుంట టౌన్ జూన్ 10 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం పాలకవర్గ సాధారణ సమావేశం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ శ్రీమతి పుల్లూరి స్వప్న–సదానందం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముందుగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.

అనంతరం పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. మార్చి–2026, ఏప్రిల్–2026, మే–2026 నెలల ఆదాయ, వ్యయాల వివరాలను సమీక్షించారు. అలాగే ఇల్లంతకుంట, వీణవంక మండలాల రైతుల సౌకర్యార్థం ఆయా మండల కేంద్రాల్లో అన్ని వసతులతో ఉప మార్కెట్ యార్డుల నిర్మాణం చేపట్టడంతో పాటు సిమెంట్ కాంక్రీట్ రహదారులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో మార్కెట్ కార్యదర్శి ఎన్. రాజా, ఉపాధ్యక్షుడు ఎర్రం సతీష్ రెడ్డి, సభ్యులు శ్రీపతి రెడ్డి, సునీల్, సతీష్, రాజేశ్వరరావు, సదానందం, సురేష్, దీక్షిత్, శ్రీనివాస్ రెడ్డి, రషీద్ పాషా, తిరుపతి, శ్యామ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ కూడా సమావేశానికి హాజరయ్యారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .