పార్టీ బలోపేతానికి బీఎల్ఏలు వారధులుగా పనిచేయాలి.

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి.

పార్టీ బలోపేతానికి బీఎల్ఏలు వారధులుగా పనిచేయాలి.

వనపర్తి,జూన్08(తెలంగాణ ముచ్చట్లు):

కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో బీఎల్ఏల పాత్ర కీలకమని, ప్రతి బీఎల్ఏ వెయ్యి మంది కార్యకర్తలతో సమానమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.సోమవారం వనపర్తి పట్టణంలోని ఆర్‌జీ గార్డెన్స్‌లో నిర్వహించిన బీఎల్ఏల శిక్షణ కార్యక్రమం, మండల అధ్యక్షుల పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి డబుల్ ఓట్లను గుర్తించి తొలగించేలా చర్యలు తీసుకోవాలని బీఎల్ఏలకు సూచించారు. అలాగే ప్రతి ఓటరును కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని కోరారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఇటీవల నియమితులైన మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పదవీ బాధ్యతలు స్వీకరించగా, వారిని శాలువాలతో సత్కరించారు.కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి, బీఎల్ఏ-2 ఇన్‌చార్జి శత్రు బుజ్జి, కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .