వైయస్సార్ నగర్ లోని గుడిసెలను  కబ్జా చేయాలని చూస్తున్నారు.

వైయస్సార్ నగర్ లోని గుడిసెలను  కబ్జా చేయాలని చూస్తున్నారు.
సమావేశంలో పాల్గొన్న నాయకులు

 కాజీపేట్ జూన్ 5 (తెలంగాణ ముచ్చట్లు)

బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆరోపణలుకాజీపేట మండల కేంద్రంలోని వైఎస్ఆర్ నగర్‌లోని పేద ప్రజల గుడిసెలను అక్రమంగా ఖాళీ చేపించి ప్రభుత్వ భూమిని కొందరు కాంగ్రెస్ నాయకులు కబ్జా చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. కాజీపేట్ లోని మీడియా పాయింట్లులో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్ సంకు నర్సింగరావు నార్లగిరి రమేష్ శివకుమార్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ, కాజీపేట లోని వైఎస్ఆర్ నగర్ లో 9 ఎకరాల ప్రభుత్వ భూమి మార్కెట్ విలువ సుమారు 300 కోట్లుల విలువ ఉంటుందని పేదల గుడిసెల నుంచి ఖాళీ చేయించి కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మాజీ కార్పొరేటర్ పేదలను బెదిరిస్తున్నారని గుడిసెలను ఖాళీ చేయించేందుకు రూ 40 కోట్ల డీల్ మాట్లాడుతున్నారని ప్రచారం జరుగుతోందని వారు తెలిపారు. ఈ భూమిని పేదలకు పట్టాలు ఇచ్చి పక్కా ఇండ్లు నిర్మించాలని,  ఐటీఐ, జూనియర్ కాలేజీ, ఆసుపత్రి, ఏసీపీ కార్యాలయం, బస్టాండ్, చిరు వ్యాపారుల సముదాయాలు వంటి ప్రజా ఉపయోగ భవనాలు నిర్మించాలని  నాయకులు డిమాండ్ చేశారు.1982 నుంచి ఈ భూమిని ప్రజా ఉద్యమాల ద్వారా కాపాడినట్లు, గతంలో టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు పేదలకు కేటాయించినట్లు వారు గుర్తు చేశారు. ఈ విషయంపై హైకోర్టులో ఎల్ జి సి/6/1993 రిట్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఈ భూమి విషయంలో తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  కాటాపూర్ రాజు, మర్యాల కృష్ణ, దువ్వ కనకరాజు, రంజిత్, తేలు సారంగపాణి , బసవ యాదిగిరి, బండి రామచందర్, గబ్బెట శ్రీనివాస్, దశరథం, కొండ్ర  శంకర్, మహమూద్, రాజ్ కుమార్, కిట్టు, కుమార్ లు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి! దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి!
సత్తుపల్లి, జూన్‌ 5 (తెలంగాణ ముచ్చట్లు):  జిల్లాలో రాత్రి వేళల్లో ఇంటి దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్...
ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానం.
పాలమూరు పర్యటనలో రేవంత్ పచ్చి అబద్ధాలు.
జమ్మికుంటలో బీఎస్పీ శక్తి ప్రదర్శనకు సన్నాహాలు.
రుద్రభూమిలో నాలుగు గదుల నిర్మాణానికి భూమిపూజ.
పర్యావరణ పరిరక్షణకు మొక్కలే మార్గం.
వైయస్సార్ నగర్ లోని గుడిసెలను  కబ్జా చేయాలని చూస్తున్నారు.