అగ్నిప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే రాగమయి.

అగ్నిప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే రాగమయి.

- నగదు, నిత్యావసర వస్తువుల అందజేత.
- ఇందిరమ్మ గృహం మంజూరుకు చర్యలు.

సత్తుపల్లి, జూన్ 2 (తెలంగాణ ముచ్చట్లు): 

స్థానిక పట్టణంలోని వెంగళరావు కాలనీలో అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబానికి ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ అండగా నిలిచారు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో షేక్ బీబీ, రెహమాన్ దంపతుల ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లోని సామగ్రి, గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఘటన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారికి బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, గిన్నెలు, ప్లేట్లు, కూరగాయలు అందజేయడంతో పాటు రూ.5 వేల నగదు సహాయం చేశారు. అదేవిధంగా తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి బాధితురాలు షేక్ బీబీకి ఇందిరమ్మ గృహం మంజూరు అయ్యేలా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రెహనా బేగం, వైస్ చైర్‌పర్సన్ బొంతు సుమలత, మున్సిపల్ కమిషనర్ నరసింహ, కౌన్సిలర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్, జాతీయ బీసీ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు, సీనియర్ నాయకుడు చల్లగుళ్ల నరసింహరావు, వెంగళరావు కాలనీ కాంగ్రెస్ నాయకులు భాస్కర్, మురళిరెడ్డి, మొరిశెట్టి సాంబశివరావు, తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20260602-WA0144

Tags:

Post Your Comments

Comments

Latest News

అగ్నిప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే రాగమయి. అగ్నిప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే రాగమయి.
- నగదు, నిత్యావసర వస్తువుల అందజేత.- ఇందిరమ్మ గృహం మంజూరుకు చర్యలు. సత్తుపల్లి, జూన్ 2 (తెలంగాణ ముచ్చట్లు):  స్థానిక పట్టణంలోని వెంగళరావు కాలనీలో అగ్నిప్రమాదంలో సర్వం...
పంటను కాపాడుకుందాం.. వరి కొయ్యల దహనానికి స్వస్తి పలుకుదాం.
అమరవీరుల స్ఫూర్తితో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
తెలంగాణ ఆవిర్భావ స్పూర్తితో ఘనంగా వేడుకలు.
ఆగిన రోడ్లే కాంగ్రెస్ పాలనకు నిదర్శనం.
హుజూరాబాద్ LIC అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లోకిని రాజయ్యకు ఘన వీడ్కోలు.
తెలంగాణ స్పూర్తిని చాటిన హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి.