మహిళా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.

మహిళా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

పెబ్బేరు,మే 31(తెలంగాణ ముచ్చట్లు)

రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.ఆదివారం వనపర్తి జిల్లా పెబ్బేరులో నిర్వహించిన చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని, వనపర్తి నియోజకవర్గంలో 37,500 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి సన్నబియ్యం అందజేస్తోందని తెలిపారు.అలాగే ఉచిత విద్యుత్, వడ్డీ లేని రుణాలు, మహిళలకు ఉపాధి అవకాశాల కల్పన ద్వారా వారి ఆర్థిక పురోగతికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు.మహిళలను వివిధ రంగాల్లో భాగస్వాములను చేస్తూ స్వయం సమృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.మహిళల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రజలు గుర్తిస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే విమర్శలకు సమాధానం చెబుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .