మోసలకు పాల్పడుతున్న నిందుతుడు అరెస్ట్... రిమాండ్ తరలిపింపు.

ఏసీపీ రమణమూర్తి.

మోసలకు పాల్పడుతున్న నిందుతుడు అరెస్ట్... రిమాండ్ తరలిపింపు.

ఖమ్మం బ్యూరో, మే 30(తెలంగాణ ముచ్చట్లు )

కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామానికి చెందిన ఎన్టిపిసి రామగుండం మాజీ ఉద్యోగి తోట బాలాజీ నాయుడు అనే వ్యక్తి పరిచయమై తనకు చాలామంది పరిచయస్తులు ఉన్నారని వారి ద్వారా లోన్లు ఇప్పిస్తాను అని చెప్పగా పువ్వాడ  ఉదయ నగర్ గ్రామం రఘునాథపాలెం మండలం కు చెందిన వడ్లకుంట శివ అనే వ్యక్తి కుటుంబ అవసరాల నిమిత్తం 10 లక్షల రూపాయలు అవసరం ఉన్నదని, ఇప్పించమని తోట బాలాజీ నాయుడు ని అడుగగా అతను అట్టిలోను ఇప్పించుట గురించి మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పగా వడ్లకుంట శివ ఖమ్మానికి చెందిన తన స్నేహితుల ద్వారా రెండు లక్షల 50 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా తోట బాలాజీ నాయుడు కి పంపినాడు.సదరు తోట బాలాజీ నాయుడు గతంలో ఎన్టిపిసి రామగుండం నందు ఏఈ గా పనిచేస్తూ.. ఏసీబీ సిబిఐ వారికి లంచం తీసుకుంటూ దొరికి ఉద్యోగం నుండి తీసివేయబడినాడు. అప్పటి నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న  నాయకులు  లకు ఫోన్ చేసి నేను అడిషనల్ సెక్రెటరీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్,  అని ఫోన్ చేసి చెప్పి ప్రధానమంత్రి వికసిత్ భారత్  రోజ్ గార్  యోజన మరియు చీఫ్ మినిస్టర్ అన్ ఎంప్లాయిమెంట్  స్కీమ్ కు సంబంధించి మీ నియోజకవర్గానికి ఫండ్స్ వచ్చినవి అని మీ నియోజకవర్గ నుండి అప్లికేషన్లు పంపండి మనిషికి 2500/- రూపాయలు చలానాగా కట్టాలి నేను స్కానర్ పెడతాను పదిమందికి 25 వేల రూపాయలు చొప్పున మీరు ఎంతమందికి కావాలో అన్ని డబ్బులు నేను పెట్టిన స్కానర్ కు కొట్టమని డబ్బులు కొట్టించుకునే వాడు. సదరు తోట బాలాజీ నాయుడు గతంలో 2016 వ సంవత్సరంలో బంజారాహిల్స్ పోలీసు వారు పీడీ యాక్ట్  పెట్టి చంచల్ గూడ  జైలుకి  పంపినారు. అదేవిధంగా 2025 సంవత్సరంలో  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఫోన్ చేసి డబ్బులు తీసుకుని అట్టి కేసులో కూడా జైలుకు పోయి వచ్చినాడు. సదరు బాలాజీ నాయుడు రెండు రాష్ట్రాల్లో ఉన్న నాయకులని లక్ష్యంగా చేసుకొని వారి వద్ద నుండి మోసపూరితంగా డబ్బులు తీసుకుంటూ అదే విధంగా రఘునాధపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని పువ్వాడ ఉదయ నగర్ కు చెందిన వడ్లకుంట శివ అనే వ్యక్తిని కూడా మోసం చేసి రెండు లక్షల 50 వేల రూపాయలు నగదును క్యూఆర్   కోడ్  స్కానర్లు పెట్టి మోసపూరితంగా డబ్బులు తీసుకున్నాడు. ఇట్టి కేసుని రఘునాధపాలెం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎండి ఉస్మాన్ షరీఫ్  కేసు నమోదు చేయడం జరిగింది.
ప్రస్తుతం చించు పేట, జండా చెట్టు బజార్, తెనాలి తాలూకా, గుంటూరు జిల్లాలో నివాసం ఉంటునట్లు విచారణ నిందుతుడు తెలిపారు. నిండుతుడిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది అని ఏసిపి రమణమూర్తి తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్‌తో టెట్ మినహాయింపు కల్పించాలి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్‌తో టెట్ మినహాయింపు కల్పించాలి.
వనపర్తి,మే30(తెలంగాణ ముచ్చట్లు): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సమీక్షా పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని, వారికి ఉపశమనం కల్పించేందుకు...
ఏసీబీ ట్రాప్ కేసులో నేలకొండపల్లి పూర్వ తహసిల్దారు  నరసింహారావుకు జైలు శిక్ష.
కోర్టు వాయిదాలకు గైర్హాజరు.. నలుగురిని హుజూరాబాద్ జైలుకు తరలింపు.
యుద్ధప్రాతిపదికన గట్ల నర్సింగాపూర్ బ్రిడ్జి నిర్మించాలి!
చిట్టీ డబ్బుల వివాదం.. యువకుడి ఆత్మహత్యాయత్నం.
మహిళల ఆర్థికాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం: చైర్మన్ దిలీప్.
పెద్దమందడి మండల కేంద్రంలో తాగునీటి సమస్య.. పట్టించుకోని అధికారులు .