ఖమ్మం ప్రయాణికులకు గుడ్‌న్యూస్.

సత్తుపల్లి నుంచి వేగవంతమైన డీలక్స్ సర్వీసులు ప్రారంభం.

ఖమ్మం ప్రయాణికులకు గుడ్‌న్యూస్.

సత్తుపల్లి, మే 20 (తెలంగాణ ముచ్చట్లు): 

సత్తుపల్లి-ఖమ్మం మధ్య ప్రయాణించే వారికి సమయ ఆదా కల్పించేలా ఆర్టీసీ ప్రత్యేకంగా ‘3 స్టాప్స్’ డీలక్స్ బస్సు సర్వీసులను ప్రారంభించింది. బుధవారం నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ డీలక్స్ బస్సులకు వీఎం బంజర, కల్లూరు, వైరా ప్రాంతాల్లో మాత్రమే స్టాపులు కల్పించినట్లు చెప్పారు. దీంతో సత్తుపల్లి నుంచి ఖమ్మం, ఖమ్మం నుంచి సత్తుపల్లి ప్రయాణించే వారికి ప్రయాణ సమయం తగ్గుతుందని పేర్కొన్నారు. సత్తుపల్లి నుంచి ఉదయం 7:00, 7.30, 8:00 గంటలకు, మధ్యాహ్నం 11.45, 12.15, 1:00 గంటలకు, సాయంత్రం 4.30, 5:00, 5.40 గంటలకు బస్సులు బయలుదేరనున్నాయి. అలాగే ఖమ్మం నుంచి ఉదయం 9.20, 9.45, 10.15 గంటలకు, మధ్యాహ్నం 2.15, 2.50, 3.30 గంటలకు, సాయంత్రం 6.40, 7.15, రాత్రి 8:00 గంటలకు సర్వీసులు నడుస్తాయని తెలిపారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక డీలక్స్ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .