కొత్తపల్లిలో పింఛన్ లబ్ధిదారుల ఆధార్ వెరిఫికేషన్
అర్హులకే పింఛన్లు అందేలా ప్రత్యేక శిబిరం నిర్వహణ
జమ్మికుంట టౌన్ మే 18 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి 18వ వార్డులో పింఛన్ లబ్ధిదారుల కోసం ప్రత్యేక ఆధార్ వెరిఫికేషన్ శిబిరం నిర్వహించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పటికే పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల వివరాలను ధృవీకరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
కొత్తపల్లి హనుమాన్ దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో లబ్ధిదారుల ఆధార్ వివరాలు, పింఛన్ సంబంధిత సమాచారం పరిశీలించి నమోదు చేశారు. పింఛన్లు సక్రమంగా అర్హులకే అందేలా పారదర్శక విధానంలో వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కుతాటి తిరుపతి, వార్డు ఆఫీసర్ రామారావు, మున్సిపాలిటీ సిబ్బంది శ్రీకాంత్‌తో పాటు వార్డు సభ్యులు పాల్గొని లబ్ధిదారులకు అవసరమైన సహాయం అందించారు.
అధికారులు మాట్లాడుతూ, ప్రతి లబ్ధిదారుడు తన ఆధార్ వివరాలను సరిచూసుకుని సమర్పించాలని సూచించారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియతో పింఛన్ వ్యవస్థలో పారదర్శకత పెరిగి, అర్హులైన వారికి సేవలు మరింత సమర్థంగా అందుతాయని తెలిపారు.


Comments