తాటి వనంలో యువకుడి దారుణ హత్య.

ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి.

తాటి వనంలో యువకుడి దారుణ హత్య.

ఎల్కతుర్తి, మే 14 (తెలంగాణ ముచ్చట్లు):
 
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని తాటి వనంలో యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన గురువారం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన గొడిశాల విజయ్ కుమార్ (30) ప్రతిరోజులాగే తన వృత్తి అయిన కళ్ళు గీసే పనిలో నిమగ్నమై ఉన్నాడు.
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అక్కినేపల్లి అఖిల్ కళ్ళు కావాలని అడగగా విజయ్ కుమార్ అతనికి కళ్ళు ఇచ్చాడు. అనంతరం అక్కడే కూర్చొని కళ్ళు తాగుతున్న అఖిల్ కొంతసేపటి తర్వాత విజయ్ కుమార్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. తన భార్యతో అక్రమ సంబంధం ఉందంటూ ఆరోపిస్తూ తన వెంట తెచ్చుకున్న వేట కొడవలితో విజయ్ కుమార్‌పై దాడి చేసినట్లు మృతుడి భార్య గొడిశాల శ్వేత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దాడిలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్న విజయ్ కుమార్‌ను గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి భార్య శ్వేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయిIMG-20260514-WA0136
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .