ఆడబిడ్డకు అన్యాయం జరిగితే జిల్లాలో మహిళా నేతలే లేరా..?
Views: 4
On
బండి భగీరథ ఘటనపై మౌనం పాటిస్తున్న రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్న ప్రజలు
వనపర్తి,మే13(తెలంగాణ ముచ్చట్లు) :
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో, వనపర్తి జిల్లాలో మహిళా నేతలు, రాజకీయ పార్టీలు స్పందించకపోవడంపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఒక మైనర్ బాలికపై అత్యాచారయత్నం ఆరోపణలు వెలుగులోకి వచ్చినా, మహిళా హక్కుల గురించి మాట్లాడే నాయకులు మౌనం పాటించడం బాధాకరమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా మహిళా నేతలు మీడియా ముందుకు వచ్చి ఘటనను ఖండించకపోవడం, కనీసం ప్రకటన రూపంలోనైనా స్పందించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.మహిళల భద్రత, బాలికల హక్కుల అంశాల్లో ఎప్పుడూ గొంతెత్తే నాయకులు ఇప్పుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో మహిళా నేతలే లేరా..? అంటూ సామాన్యులు నిలదీస్తున్నారు.వ్యక్తిగతంగా రాజకీయ లాభం చేకూరే అంశాలపై మాత్రం రాజకీయ పార్టీలు, మహిళా నేతలు పెద్ద ఎత్తున ప్రచారాలు, ఆర్భాటాలు నిర్వహిస్తారని, కానీ ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే స్పందించకుండా మౌనం పాటించడం దురదృష్టకరమని ప్రజలు విమర్శిస్తున్నారు.ఈ ఘటనపై జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్దగా స్పందన లేకపోవడం గమనార్హం.కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే ఘటనను ఖండించారు.ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందించాల్సిన అవసరం ఉందని, బాధితురాలికి న్యాయం జరిగేలా మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ముందుకు రావాలని ప్రజలు కోరుతున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
14 May 2026 16:12:40
- ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబురావు.
దమ్మపేట, మే 14(తెలంగాణ ముచ్చట్లు):
మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో...


Comments