గృహ ప్రవేశాల్లో పాల్గొని లబ్ధిదారులతో ఆనందం పంచుకున్న ప్రణవ్.

గృహ ప్రవేశాల్లో పాల్గొని లబ్ధిదారులతో ఆనందం పంచుకున్న ప్రణవ్.

జమ్మికుంట టౌన్ మే 09 (తెలంగాణ ముచ్చట్లు):
 
జమ్మికుంట పట్టణ, మండల పరిధిలో నిర్మించిన పలు ఇందిరమ్మ నూతన గృహాల గృహ ప్రవేశ కార్యక్రమాలకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు. పేద కుటుంబాలు సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటూ సంతోషంగా గృహ ప్రవేశాలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఇళ్లలోకి అడుగుపెడుతున్న సమయంలో లబ్ధిదారుల కళ్లల్లో కనిపిస్తున్న ఆనందం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రెండవ విడతలో మరిన్ని ఇళ్లను ఈ నెలాఖరులోగా మంజూరు చేయనున్నట్లు తెలిపారు.IMG-20260509-WA0065
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .