శివాజీ ఆశయాలు యువతకు మార్గదర్శకం

- డా.జిల్లెల చిన్నారెడ్డి

శివాజీ ఆశయాలు యువతకు మార్గదర్శకం

గోపాలపేట,మే6(తెలంగాణ ముచ్చట్లు):
 
 వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్ధారం గ్రామంలో గ్రామ శివాజీ యూత్, గ్రామ యువత ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికసంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ శివాజీ మహారాజు ధైర్యసాహసాలు, దేశభక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు.అణగారిన వర్గాల రక్షణ కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. శివాజీ పరిపాలనలో లౌకికవాదానికి పెద్దపీట వేయడంతో పాటు మహిళలకు గౌరవం కల్పించిన గొప్ప నాయకుడిగా నిలిచారని తెలిపారు.స్వదేశాభిమానం, పరిపాలనా నైపుణ్యం కలిగిన నాయకుడిగా శివాజీ యువతకు స్ఫూర్తి చిహ్నమని పేర్కొంటూ, ఆయన జీవితం నుంచి యువత స్పూర్తి పొందాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో మహనీయుల విగ్రహాల ఏర్పాటు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు.శివాజీ విగ్రహావిష్కరణకు కృషి చేసిన శివాజీ యూత్ సభ్యులు, గ్రామ యువతను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శేఖర్ గౌడ్, ఉప సర్పంచ్ శివాజీ, మాజీ సర్పంచ్ అచ్చిత రామారెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .