ప్రభుత్వానికి రూ.2.42 కోట్ల నష్టం.. రైస్ మిల్ యజమాని అరెస్ట్.

ప్రభుత్వానికి రూ.2.42 కోట్ల నష్టం.. రైస్ మిల్ యజమాని అరెస్ట్.

వేలేరు, ఆగస్టు 14 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం చేసి సీఎంఆర్ (కస్టమ్ మిల్ల్డ్ రైస్) బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వానికి రూ.2.42 కోట్ల మేర నష్టం కలిగించిన కేసులో రైస్ మిల్ యజమాని మండల అరుణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఖరీఫ్ 2023-24 సీజన్‌లో కస్టమ్ మిల్లింగ్ కోసం వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి ఇండస్ట్రీస్ రైస్ మిల్లుకు ప్రభుత్వం 1,585.040 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అందజేసింది. ఇందుకు గాను 1,061.976 మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌ను ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా, ఇప్పటివరకు 602.111 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ మాత్రమే అందజేశారు. దీంతో 459.865 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బకాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రభుత్వం సీఎంఆర్ సరఫరా గడువును 24 జూన్ 2026 వరకు పొడిగించినప్పటికీ, మిల్లర్ బకాయి ధాన్యాన్ని అందజేయకపోవడంతో డిప్యూటీ తహసీల్దార్ (సివిల్ సప్లయ్స్), హనుమకొండ నిర్వహించిన తనిఖీలో రైస్ మిల్‌లో ప్రభుత్వ ధాన్యం నిల్వలు లేవని తేలింది.
ఒప్పంద నిబంధనల ప్రకారం బకాయి ధాన్యం విలువతో పాటు 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ కలిపి మొత్తం రూ.2,42,02,477 ప్రభుత్వానికి రికవరీ చేయాల్సి ఉందని అధికారులు నిర్ధారించారు.
ఈ మేరకు ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం, ఒప్పంద నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి రైస్ మిల్ యజమాని మండల అరుణ్ కుమార్‌పై వేలేరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఏసీపీ కాజిపేట్ పి. ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది.
ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం, సీఎంఆర్ బకాయిల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని ఏసీపీ పి. ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ విజయవంతం. హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ విజయవంతం.
జమ్మికుంట టౌన్, ఆగస్టు 14 (తెలంగాణ ముచ్చట్లు): కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా...
ప్రభుత్వానికి రూ.2.42 కోట్ల నష్టం.. రైస్ మిల్ యజమాని అరెస్ట్.
పోచమ్మ తల్లి ఆలయంలో బోరుబావికి శ్రీకారం.
పేదల సంక్షేమ పథకాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం.
విద్యారంగ సమస్యలపై యూఎస్పీసీ సమరభేరి.
సత్తుపల్లిలో 6.36 కిలోల గంజాయి పట్టివేత.
IIIT సీటు సాధించిన హాసినికి సర్పంచ్ ఆర్థిక సాయం.