తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల గుర్తింపును వేగవంతం చేయండి.
డాక్టర్ పిడమర్తి రవి , డాక్టర్ కె.వి కృష్ణారావు.
ఖమ్మం బ్యూరో, ఆగస్టు 10(తెలంగాణ ముచ్చట్లు )
రెండు తరాల తెలంగాణ ఉద్యమాకారులను సుమారుగా లక్ష మందిని గుర్తించండి కాంగ్రెస్ మళ్ళీ గెలుస్తుందని , అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల గుర్తింపును వేగవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ పిడమర్తి రవి , డాక్టర్ కె.వి కృష్ణారావు అన్నారు . చిన్నారి హాస్పిటల్ డైరెక్టర్ ఆఫీస్ లో రెండు తరాల తెలంగాణ ఉద్యమకారుల అపూర్వ సమ్మేళనం కరపత్రాన్ని జమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి , తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కె.వి కృష్ణారావు మరియు మిగతా నాయకులతో కలిసి ఆవిష్కరించారు . తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల కుటుంబాలు ఉద్యమంలో గాయపడిన వారు ఆగిపోయింది జైలుకుపోయిన వారు ఉద్యమం నడిపిన వారు సంఘాలు ఏర్పాటు చేసిన వాళ్లు అందరిని కలిపి లక్ష మందిని గుర్తించాలని వారికి 250 చదరపు గజాల స్థలం మరియు పెన్షన్ , గుర్తింపు కార్డులు ఇవ్వాలని పిడమర్తి రవి కోరారు . సెప్టెంబర్ 16న హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగే అపూర్వ సమ్మేళనానికి 1969 - 2009 ఉద్యమకారులు హాజరుకావాలని కోరారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు దేవి రెడ్డి విజయ్ , మట్టి గురుమూర్తి , జిల్లా విజయ్ , రాకేష్ , భూక్య హరినాయక్ తదితరులు పాల్గొన్నారు.


Comments