జమ్మికుంట అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. 38 కీలక తీర్మానాలకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం.

జమ్మికుంట అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. 38 కీలక తీర్మానాలకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం.

* డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు, వినాయక నిమజ్జన ఏర్పాట్లకు గ్రీన్ సిగ్నల్

జమ్మికుంట, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన 38 కీలక ప్రతిపాదనలకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభివృద్ధి, పరిపాలనకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
సమావేశంలో మున్సిపల్ కార్యాలయ వాహనాల మరమ్మతులు, శ్రీరామ హాస్పిటల్ నుంచి హోటల్ నరసయ్య ఇంటి వరకు డ్రైనేజీ, కల్వర్టు నిర్మాణం, వర్షాకాలంలో నీరు నిలిచే ప్రాంతాల్లో ఆర్‌సీసీ పైపుల కొనుగోలు, తాగునీటి పైప్‌లైన్ లీకేజీల మరమ్మతులు, బ్లేడ్ ట్రాక్టర్, జేసీబీ, లాడర్ మరమ్మతులకు ఆమోదం తెలిపారు.
రానున్న వినాయక చవితి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్ల అద్దె, జనరేటర్, టెంట్లు, స్టేజ్ ఏర్పాటు, పట్టణ రహదారులపై గుంతల పూడ్చివేత పనులకు కూడా కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో సీసీ కెమెరాలు, ఇంటర్‌కామ్ కనెక్షన్లు, టీవీ ఏర్పాటు, గాంధీ చౌక్‌లోని జాతీయ జెండా స్థంభం మరమ్మతులు, జెండా ఆవిష్కరణ కార్యక్రమం కోసం రూ.1 లక్ష, వీధి దీపాల నిర్వహణకు అవసరమైన పీసీబీఎస్ సెన్సార్లు, డ్రైవర్లు, ఎల్ఈడీ లైట్లు తదితర సామగ్రి కొనుగోలుకు రూ.10 లక్షలు, పట్టణ హరితాభివృద్ధికి మొక్కల కొనుగోలు, డ్రైనేజీ నిర్మాణ పనులకు కూడా కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
ఈ సమావేశంలో వైస్ చైర్మన్ జావిద్, మున్సిపల్ కౌన్సిలర్లు, మేనేజర్ జి. రాజిరెడ్డి, ఏఈ వికాస్, జేఏఓ రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.IMG-20260731-WA0016

Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంట అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. 38 కీలక తీర్మానాలకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం. జమ్మికుంట అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. 38 కీలక తీర్మానాలకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం.
* డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు, వినాయక నిమజ్జన ఏర్పాట్లకు గ్రీన్ సిగ్నల్ జమ్మికుంట, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన...
77 వారాలుగా నిరంతర అన్నప్రసాద సేవ.
తరాలను తీర్చిదిద్దిన గురువుకు ఘన వందనం.
శ్రీ మడేలేశ్వరస్వామి బోనాలకు ఘన శ్రీకారం.
గ్రామీణుల ఆరోగ్యానికి బాలవికాస చేయూత.
ఐదవ వార్డులో విస్తృతంగా మొక్కల పంపిణీ.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.