ఎస్‌ఎస్‌సీలో 100 శాతం ఫలితాలే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి.

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి.

ఎస్‌ఎస్‌సీలో 100 శాతం ఫలితాలే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి.

వనపర్తి,జూలై31(తెలంగాణ ముచ్చట్లు):

రాబోయే పదో తరగతి వార్షిక పరీక్షల్లో వనపర్తి జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గణితం, ఇంగ్లీష్, సైన్స్ సబ్జెక్టుల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.శుక్రవారం వనపర్తి పట్టణంలోని ఉర్దూ మాధ్యమ పాఠశాలలో నిర్వహించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో కలెక్టర్ పాల్గొని పదో తరగతి విద్యార్థుల పరీక్షల సన్నద్ధత, ప్రత్యేక బోధన కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు.గణితం, ఇంగ్లీష్, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను ఆగస్టు 12లోగా ఉపాధ్యాయులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. గణితం, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో ఆబ్జెక్టివ్ పరీక్షలు నిర్వహించి, వెనుకబడిన విద్యార్థులను గుర్తించాలని తెలిపారు. వారికి మూడు నెలల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి, వ్యక్తిగత శ్రద్ధతో బలహీనతలను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.విద్యార్థుల పురోగతిని ఎప్పటికప్పుడు పరీక్షల ద్వారా అంచనా వేస్తూ అవసరమైన చోట అదనపు బోధన అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలును సమీక్షించి, పాఠశాలల్లో గ్యాస్ కనెక్షన్లను వినియోగిస్తూ పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు. విద్యా ప్రమాణాల పెంపుతో పాటు మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంట అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. 38 కీలక తీర్మానాలకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం. జమ్మికుంట అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. 38 కీలక తీర్మానాలకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం.
* డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు, వినాయక నిమజ్జన ఏర్పాట్లకు గ్రీన్ సిగ్నల్ జమ్మికుంట, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన...
77 వారాలుగా నిరంతర అన్నప్రసాద సేవ.
తరాలను తీర్చిదిద్దిన గురువుకు ఘన వందనం.
శ్రీ మడేలేశ్వరస్వామి బోనాలకు ఘన శ్రీకారం.
గ్రామీణుల ఆరోగ్యానికి బాలవికాస చేయూత.
ఐదవ వార్డులో విస్తృతంగా మొక్కల పంపిణీ.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.