వీరాయపల్లిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి.
సర్పంచ్ చిట్యాల వెంకటేష్.
Views: 0
On
పెద్దమందడి,జూలై29: (తెలంగాణ ముచ్చట్లు)
పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేసినట్లు గ్రామ సర్పంచ్ చిట్యాల వెంకటేష్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) కీలక పాత్ర పోషించారని అన్నారు. గ్రామ ప్రజల సహకారంతో బీఎల్‌ఓలు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో సాధించారని కొనియాడారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేసేందుకు కృషి చేసిన బీఎల్‌ఓలను సర్పంచ్ చిట్యాల వెంకటేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన గ్రామ ప్రజలు, సంబంధిత అధికారులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
29 Jul 2026 20:58:37
జమ్మికుంట రూరల్ జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మండలంలోని అంకుశాపూర్ గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ఓ రైతు మృతిచెందిన విషాద...


Comments