కీశే గడ్డం లక్ష్మికి బీసీ జేఏసీ నాయకుల ఘన నివాళి.
కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం.
హుజురాబాద్, జూలై 27(తెలంగాణ ముచ్చట్లు ):
కొత్తకొండ ధర్మారం గ్రామానికి చెందిన కీశే గడ్డం లక్ష్మి మృతి పట్ల హుజురాబాద్ బీసీ జేఏసీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ నెల 23న బిందెవరపల్లి గ్రామంలో పరమపదించిన గడ్డం లక్ష్మికి ఘనంగా నివాళులర్పించి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.
హుజురాబాద్ పట్టణానికి చెందిన కెఆర్ టైలర్ బిక్షపతి సతీమణి శ్రీలత తల్లిగారైన గడ్డం లక్ష్మి మృతి వార్త తెలుసుకున్న బీసీ జేఏసీ నాయకులు ఆమె కుమారులు గడ్డం మోహన్, సత్యం, బాలకృష్ణ, హరికృష్ణలను కలిసి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా గడ్డం లక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరారు.
ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న మాట్లాడుతూ, గడ్డం లక్ష్మి–రాజమౌళి దంపతులు గ్రామంలో మంచితనానికి, సేవాభావానికి ప్రతీకలుగా నిలిచారని కొనియాడారు. వారి ఆదర్శ జీవితం గ్రామ ప్రజలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న, ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, రాష్ట్ర పద్మశాలి సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగెం సత్యనారాయణ, ఇప్పలపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు.


Comments