ప్రభుత్వ పాఠశాలలకు వాటర్ ప్యూరీఫైర్లు.

విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

ప్రభుత్వ పాఠశాలలకు వాటర్ ప్యూరీఫైర్లు.

హుజురాబాద్,జులై 27(తెలంగాణ ముచ్చట్లు ):

హుజూరాబాద్ నియోజకవర్గంలో విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆధునిక వాటర్ ప్యూరీఫైర్లను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం రాజపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి వాటర్ ప్లాంట్‌ను ప్రజలకు అంకితం చేశారు.
ఈ సందర్భంగా కాట్రపల్లి, కందుగుల, పెద్దపాపయ్యపల్లి, హుజూరాబాద్ బాలుర, హుజూరాబాద్ బాలికల, సింగాపూర్, సిర్సపల్లి, చెల్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరీఫైర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సదుపాయం ద్వారా వేలాది మంది విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రానుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులే దేశ భవిష్యత్తని, వారికి నాణ్యమైన విద్యతో పాటు స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
అలాగే చెల్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను దత్తత తీసుకుని దశలవారీగా అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, పారిశుధ్యం తదితర సదుపాయాల కల్పనకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, గందె శ్రీనివాస్, తిరుమల్, ముత్యం రాజు, సర్పంచ్ మల్లారెడ్డి, రాజు, జయన్న ఫౌండేషన్ ప్రతినిధులు గుడిపాటి సరిత, జైపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.IMG-20260727-WA0015

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రభుత్వ పాఠశాలలకు వాటర్ ప్యూరీఫైర్లు. ప్రభుత్వ పాఠశాలలకు వాటర్ ప్యూరీఫైర్లు.
హుజురాబాద్,జులై 27(తెలంగాణ ముచ్చట్లు ): హుజూరాబాద్ నియోజకవర్గంలో విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆధునిక...
కీశే గడ్డం లక్ష్మికి బీసీ జేఏసీ నాయకుల ఘన నివాళి.
అర్చక కుటుంబానికి ఆర్థిక చేయూత .
పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.
విధులు నిర్వర్తిస్తున్నా వేతనాలు అందడం లేదంటూ ఆవేదన.
విద్యార్థుల దాహార్తి తీర్చిన రామ్‌కీ ఫౌండేషన్.
పెద్దమందడి రైతు వేదికలో విత్తన మేళా ప్రారంభం.