విధులు నిర్వర్తిస్తున్నా వేతనాలు అందడం లేదంటూ ఆవేదన.

విధులు నిర్వర్తిస్తున్నా వేతనాలు అందడం లేదంటూ ఆవేదన.

ఎల్కతుర్తి జులై 27(తెలంగాణ ముచ్చట్లు):

గత మూడు నెలలుగా విధులు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నప్పటికీ వేతనాలు అందడం లేదని వీవీబీజీ రామ్‌జీ క్షేత్ర సహాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) విజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా క్షేత్ర సహాయకుల సంఘం మండల అధ్యక్షుడు ఎదురుగట్ల రాజేష్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో అప్పగించిన బాధ్యతలను ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా నిర్వర్తిస్తున్నప్పటికీ మూడు నెలలుగా వేతనాలు అందక ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. నిత్యావసర ఖర్చులు, పిల్లల విద్య, వైద్య అవసరాలు తీర్చుకోవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన ఎంపీడీవో విజయ్ కుమార్ సమస్యను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వేతనాల విడుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీవో అనిత, క్షేత్ర సహాయకులు కిరణ్, సంపత్, రాజయ్య, సంతోష్, స్వరూప, చంద్రకళ, సదానందం, దాసకిరణ్, కొమరయ్య, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రభుత్వ పాఠశాలలకు వాటర్ ప్యూరీఫైర్లు. ప్రభుత్వ పాఠశాలలకు వాటర్ ప్యూరీఫైర్లు.
హుజురాబాద్,జులై 27(తెలంగాణ ముచ్చట్లు ): హుజూరాబాద్ నియోజకవర్గంలో విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆధునిక...
కీశే గడ్డం లక్ష్మికి బీసీ జేఏసీ నాయకుల ఘన నివాళి.
అర్చక కుటుంబానికి ఆర్థిక చేయూత .
పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.
విధులు నిర్వర్తిస్తున్నా వేతనాలు అందడం లేదంటూ ఆవేదన.
విద్యార్థుల దాహార్తి తీర్చిన రామ్‌కీ ఫౌండేషన్.
పెద్దమందడి రైతు వేదికలో విత్తన మేళా ప్రారంభం.