అంబేద్కర్ భవనం, దళిత బంధుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు వినతి.

హుజూరాబాద్ అభివృద్ధి అంశాలపై మంత్రి సానుకూల స్పందన.

అంబేద్కర్ భవనం, దళిత బంధుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు వినతి.

హుజురాబాద్ , జూలై 16 (తెలంగాణ ముచ్చట్లు):

హుజూరాబాద్ పట్టణ అభివృద్ధి, దళిత సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ గురువారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా హుజూరాబాద్ పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై అసంపూర్తిగా నిలిచిపోయిన అంబేద్కర్ భవన నిర్మాణానికి తక్షణమే పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని ఆయన మంత్రిని కోరారు. అలాగే దళిత బంధు పథకం కింద పెండింగ్‌లో ఉన్న గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన లబ్ధిదారులకు త్వరగా పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని, వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ప్రణవ్ కోరారు.
వినతులపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సానుకూలంగా స్పందించారు. హుజూరాబాద్‌కు సంబంధించిన అంశాలపై ఇప్పటికే పలుమార్లు సమీక్షించినట్లు పేర్కొంటూ, అంబేద్కర్ భవనం నిర్మాణం, దళిత బంధు గ్రౌండింగ్ ప్రక్రియ, సంక్షేమ పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన విషయాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ భేటీలో హుజూరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నట్లు వొడితల ప్రణవ్ తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్.
పెద్దమందడి,జులై17(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో  తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు ప్రతిపాదనలో భాగంగా జిల్లా...
వాన కోసం భక్తి జలధార.. రంగమ్మపెల్లిలో 200 మంది మహిళల నీరాభిషేకాలు.
ప్రజల భద్రతే లక్ష్యం.. విలాసాగర్‌లో ఏడు సీసీ కెమెరాల ఆవిష్కరణ.
మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నేత కొట్టుకూరి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం.
విద్యార్థుల సంక్షేమంపై డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక దృష్టి.
సత్తుపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.
దమ్మపేటకు సబ్‌కోర్టు మంజూరు చేయాలి.