వెల్టూర్‌లో ఓటర్ నమోదు సవరణలపై అవగాహన.

వెల్టూర్‌లో ఓటర్ నమోదు సవరణలపై అవగాహన.

పెద్దమందడి,జూలై13(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బీఎల్‌ఓ ఇన్‌చార్జి కరుణ, బీఎల్‌ఏ- 2 ఇన్‌చార్జి మద్దూర్ నరసింహ గ్రామంలో సోమవారం ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఓటరు నమోదు, ఓటరు వివరాల సవరణ, చిరునామా మార్పు, పేర్ల తొలగింపు తదితర సేవలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను అందజేస్తూ అవగాహన కల్పించారు. ఫారాలను సక్రమంగా నింపే విధానం, అవసరమైన ధ్రువపత్రాలు, దరఖాస్తు సమర్పణ ప్రక్రియ గురించి వివరించారు.ఈ సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఇప్పటికే ఓటరు జాబితాలో ఉన్నవారు తమ వివరాలను ఒకసారి పరిశీలించి, ఏవైనా తప్పులు ఉంటే సవరణ చేయించుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

27న తెలంగాణ జర్నలిస్టుల "ఛలో పార్లమెంట్". 27న తెలంగాణ జర్నలిస్టుల "ఛలో పార్లమెంట్".
ఖమ్మం బ్యూరో,జూలై 11(తెలంగాణ ముచ్చట్లు ) ఖమ్మంకేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ, ఈ నెల 27వ తేదీన "తెలంగాణ జర్నలిస్టుల ఛలో...
15 రోజుల్లో అర్హులందరికీ అక్రిడిటేషన్ లు.
దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... 
కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా..? అధికారుల వైఫల్యమా..? ఎన్ హెచ్ 765డి జి పై ప్రశ్నల వర్షం.
ఎస్‌ఐఆర్ ప్రక్రియను గ్రామంలో వేగవంతంగా పూర్తి చేయాలి.
వెల్టూర్‌లో ఓటర్ నమోదు సవరణలపై అవగాహన.
ఆరోగ్యవంతమైన బాల్యానికి నులిపురుగుల నివారణ కీలకం.