మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ .

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ .

పెద్దమందడి,జులై13(తెలంగాణ ముచ్చట్లు):

ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం తీరును తెలుసుకునేందుకు పెద్దమందడి మండలం మనిగిళ్ల ప్రభుత్వ పాఠశాలను గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రతపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి పోషక విలువలతో కూడిన నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.అనంతరం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ స్వయంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించారు. ఆ తర్వాత ఉపాధ్యాయులు, గ్రామ యువకులతో కలిసి విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం, విద్యాభివృద్ధికి గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ యువకులు బోడి గణేష్, బోయిన్ గణేష్, భాస్కర్ గౌడ్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

27న తెలంగాణ జర్నలిస్టుల "ఛలో పార్లమెంట్". 27న తెలంగాణ జర్నలిస్టుల "ఛలో పార్లమెంట్".
ఖమ్మం బ్యూరో,జూలై 11(తెలంగాణ ముచ్చట్లు ) ఖమ్మంకేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ, ఈ నెల 27వ తేదీన "తెలంగాణ జర్నలిస్టుల ఛలో...
15 రోజుల్లో అర్హులందరికీ అక్రిడిటేషన్ లు.
దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... 
కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా..? అధికారుల వైఫల్యమా..? ఎన్ హెచ్ 765డి జి పై ప్రశ్నల వర్షం.
ఎస్‌ఐఆర్ ప్రక్రియను గ్రామంలో వేగవంతంగా పూర్తి చేయాలి.
వెల్టూర్‌లో ఓటర్ నమోదు సవరణలపై అవగాహన.
ఆరోగ్యవంతమైన బాల్యానికి నులిపురుగుల నివారణ కీలకం.