కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు.

కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు.

వేలేరు, జులై 08 (తెలంగాణ ముచ్చట్లు):

 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రజానేత కడియం శ్రీహరి జన్మదిన వేడుకలను వేలేరు మండలంలో ఘనంగా నిర్వహించారు. వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మురవత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్‌లో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ ప్రతి గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న నాయకుడిగా కడియం శ్రీహరి ప్రజల ఆదరణ పొందారని కొనియాడారు. ఆయన నాయకత్వంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడు బిల్ల యాదగిరి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, కడియం అభిమానులు పాల్గొన్నారు 

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .