IIITలో సీటు సాధించిన వెన్నలకు స్ఫూర్తి ఫౌండేషన్ అండ.

IIITలో సీటు సాధించిన వెన్నలకు స్ఫూర్తి ఫౌండేషన్ అండ.

- ఎస్‌ఎస్‌సీలో 571 మార్కులతో మండల ర్యాంక్.
- ఉన్నత విద్యకు రూ.15,200 ఆర్థిక సహాయం.

కల్లూరు, జూలై 4 (తెలంగాణ ముచ్చట్లు): 

ప్రతిభకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో స్ఫూర్తి ఫౌండేషన్ మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. కల్లూరు మండలం చండ్రుపట్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో చదివి ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో 571 మార్కులతో మండల ర్యాంక్ సాధించి, బాసర IIITలో ప్రవేశం పొందిన ప్రతిభావంతురాలు రామిశెట్టి సాయి వెన్నలకు రూ.15,200 ఆర్థిక సహాయాన్ని అందజేసింది. స్ఫూర్తి ఫౌండేషన్ సహకారంతో అమెరికాలో నర్సింగ్ రంగంలో ఉన్న ఓ దాత అందించిన ఈ ఆర్థిక సహాయాన్ని శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, గ్రామ సర్పంచి కాటంనేని విజయలక్ష్మి, ఉపసర్పంచి రాధాకృష్ణ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నాగమణి, స్ఫూర్తి ఫౌండేషన్ కమిటీ సభ్యులు విద్యార్థినికి చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని సాధించిన విజయం గ్రామానికి గర్వకారణమని, ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో స్ఫూర్తి ఫౌండేషన్ విద్యార్థులకు అండగా నిలుస్తోందని పలువురు వక్తలు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఉన్నత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినికి ఆకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్ఫూర్తి ఫౌండేషన్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్ద కాటంనేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని తల్లి, కుటుంబ సభ్యులు స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్‌తో పాటు ఆర్థిక సహాయం అందించిన అమెరికా దాతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .