ఒక్క ఓటు కూడా కోల్పోవద్దు.. ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయండి.

ఒక్క ఓటు కూడా కోల్పోవద్దు.. ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయండి.

వార్డుల పర్యటనలో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రణవ్ బాబు..

జమ్మికుంట టౌన్ జూన్ 30 (తెలంగాణ ముచ్చట్లు):

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా బూత్ స్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని కరీంనగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఓడితెల ప్రణవ్ బాబు బూత్ లెవెల్ ఏజెంట్లకు సూచించారు.
మంగళవారం జమ్మికుంట పట్టణంలోని 4, 5, 19, 27, 28, 30 వార్డుల్లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. బూత్ కోఆర్డినేటర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు, బీఎల్‌ఓలతో సమావేశమై ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వార్డుల్లో పర్యటిస్తూ ఓటర్లతో నేరుగా మాట్లాడి వారి సందేహాలను తెలుసుకున్నారు. బీఎల్‌ఓలతో చర్చించి ఓటర్ల అనుమానాలను అక్కడికక్కడే నివృత్తి చేయించారు. ప్రతి బూత్ వద్ద బీఎల్‌ఓలతో పాటు బూత్ లెవెల్ ఏజెంట్లు తప్పనిసరిగా సమన్వయంతో పనిచేయాలని, ఒక్క అర్హుడైన ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, జమ్మికుంట పట్టణంలో ప్రతి పది బూత్‌లకు ఒకరి చొప్పున మొత్తం నలుగురు కోఆర్డినేటర్లను నియమించామని, వారు ఏజెంట్లతో నిరంతరం సమన్వయం చేస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ, "ఇక్కడి ఎమ్మెల్యే ప్రజా సమస్యల కంటే వివాదాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విమర్శలు చేసే ముందు, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు ఏం చేసిందో ఆత్మపరిశీలన చేసుకోవాలి" అని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును ప్రస్తావిస్తూ, "లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెలంగాణ ప్రజలకు భారంగా మార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ పేదల ప్రభుత్వంగా ముందుకు సాగుతోంది" అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గ ఎస్‌ఐఆర్ కోఆర్డినేటర్, జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్లు, యువజన నాయకులు, మహిళా నాయకురాళ్లు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలుపెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. IMG-20260630-WA0012

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .