గ్రామాల అభివృద్ధే ధ్యేయం.

గ్రామాల అభివృద్ధే ధ్యేయం.

-లింగంపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

-జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగాం,జూన్24(తెలంగాణ ముచ్చట్లు):

బచ్చన్నపేట మండలంలోని లింగంపల్లి గ్రామంలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు బుధవారం శంకుస్థాపన జరిగింది. ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న ఈ అభివృద్ధి పనులను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి, భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే అనంతరం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖ అభివృద్ధే తన  లక్ష్యమన్నారు. ప్రతి గ్రామంలో మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఉపాధి హామీ పథకం నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా గ్రామాల రూపురేఖలు మారనున్నాయని అన్నారు.
నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు.గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.IMG-20260624-WA0104

Tags:

Post Your Comments

Comments

Latest News

స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన టెన్త్ క్లాస్ బ్యాచ్ మిత్రులు. స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన టెన్త్ క్లాస్ బ్యాచ్ మిత్రులు.
స్టేషన్ ఘనపూర్,జూన్24(తెలంగాణ ముచ్చట్లు): తాటికొండ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మారపాక బుచ్చయ్య మరణం పట్ల ఆయన కుటుంబానికి టెన్త్ క్లాస్ 2004-05 బ్యాచ్...
కార్మిక గర్జన సభకు ఎంపీ కడియం కావ్యకు ఆహ్వానం .
గ్రామాల అభివృద్ధే ధ్యేయం.
చింత వరుణ్ తేజ్ మృతి ఆ కుటుంబానికి తీరని లోటు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అదనపు డైరెక్టర్‌ను కలిసిన  టిఐసీసీఐ  రాష్ట్ర నాయకులు.
57వ డివిజన్ బూత్ స్థాయి ఎన్నికల బాధ్యుల సమావేశం.