మద్దిగట్ల - మోజర్ల పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.

మద్దిగట్ల - మోజర్ల పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.

పెద్దమందడి,జూన్21(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని మద్దిగట్ల- మోజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.సెలవు దినమైనప్పటికీ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాదరావు మాట్లాడుతూ.. యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు.ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా సుఖసంతోషాలతో కూడిన జీవనం గడపవచ్చని అన్నారు.ఉపాధ్యాయులు పి. వెంకటస్వామి మాట్లాడుతూ.. యోగా భారతదేశానికి చెందిన ప్రాచీన సంపద అని, ఋషుల ద్వారా ప్రపంచానికి పరిచయమై నేడు అంతర్జాతీయ గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.ఉపాధ్యాయులు గద్వాల కృష్ణ మాట్లాడుతూ ధ్యానం, యోగా సాధన వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు.వ్యాయామ ఉపాధ్యాయులు ఎన్. వెంకటస్వామి మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.ఉపాధ్యాయులు ఏ. వెంకటస్వామి మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన యోగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడం దేశ ప్రతిష్ఠను చాటుతోందన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ యోగా ఆసనాలను ప్రదర్శించారు. ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయడంతో పాటు ఇంటి సభ్యులకు కూడా యోగా ప్రాముఖ్యతను తెలియజేయాలని ఉపాధ్యాయులు సూచించారు. కార్యక్రమంలో రికార్డు అసిస్టెంట్ చిన్నారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అధికారుల నిర్లక్ష్యానికి మూల్యం.. రూ.90 వేల మేకలు దొంగల పాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యానికి మూల్యం.. రూ.90 వేల మేకలు దొంగల పాలయ్యాయి.
అధికారుల నిర్లక్ష్యానికి మూల్యం.. రూ.90 వేల మేకలు దొంగల పాలయ్యాయి పనిచేయని సీసీ కెమెరాలే దొంగలకు అండా..? వేలేరు, జూన్ 21 (తెలంగాణ ముచ్చట్లు): వేలేరు మండలం...
అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు.
మృతుడి పిల్లల చదువులకు చేయూత.. రూ.1.36 లక్షల విద్యా సహాయ నిధి అందజేత.
ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం .
రైతాంగాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు.
సత్తుపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల.
పామాయిల్‌తో రైతు కుటుంబాల్లో వెలుగులు.