హుజూరాబాద్‌లో స్వాతంత్ర్య సంబురాలు.
ఆర్టీఐ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ.
హుజూరాబాద్,ఆగష్టు 15(తెలంగాణ ముచ్చట్లు ):
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ హుజూరాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని చాటేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, నాయకులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కమిటీ హుజూరాబాద్ మండల అధికార ప్రతినిధి తిరగమల్ల నాగార్జున సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. అనంతరం పాల్గొన్న వారికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తిరగమల్ల నాగార్జున మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేశారని గుర్తుచేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని అన్నారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవడంతో పాటు దేశ అభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాచార హక్కు చట్టం అత్యంత కీలకమైన చట్టమని నాగార్జున పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ఆర్టీఐ చట్టం పౌరులకు శక్తివంతమైన ఆయుధంగా ఉపయోగపడుతుందని అన్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారాన్ని చట్టబద్ధంగా తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉందన్నారు. ఆర్టీఐ చట్టంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు కమిటీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
ప్రజలు తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు బాధ్యతలను కూడా గుర్తించి వ్యవహరించాలని ఆయన కోరారు. అవినీతి, అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నించడంలో సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాచార హక్కు చట్టం ప్రజల చేతుల్లో ఉన్న ప్రజాస్వామ్య సాధనమని, దాన్ని చట్ట పరిధిలో ఉపయోగించి సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.అలాగే హుజురాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లొ జెండా పండుగ అత్యంత ఘనంగా నిర్వహించిన ఎండి. ఇంతియాజుద్దీన్ సబ్ రిజిస్ట్రార్,జెండా ఎగురావేసిన అనంతరం అయన మాట్లాడుతూ మనకు స్వతంత్రం వచ్చిఏనాబై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ కుల మత భేదాలు లేకుండా అందరు కలిసి జీవించడం ఒక్క భారతదేశం లోనే ఉంటుందని ప్రతి మనిషి స్వతగా జీవిస్తూ సాటి మనుషులకు సహాయం చేయాలనీ అయన అన్నారు ఈ కార్యక్రమం లొ సిబ్బంది, మరియు దస్తావేజు లేఖరులు ఎం.ఏ. అజీమ్, కాజా నవాజ్ భాషా, ఎం.డి. చాంద్ పాషా, మునిగాల ఆంజనేయులు, రాజశేఖర్, మడుపు రమేష్, చొల్లేటి రాజారెడ్డి మరియు ప్లానర్లు నలుబాల వేణుగోపాల్, పి. రమేష్ ఆర్. అరుణ్ కుమార్ ఇతరులు ప్రముఖులు
*డాక్టర్ ప్రదీప్‌కుమార్‌కు ఘన సన్మానం*
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం శ్రీ బాలాజీ హాస్పిటల్ డాక్టర్ టీ. ప్రదీప్‌కుమార్‌ను సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. పేదలు, సామాన్య ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను గుర్తించి శాలువాతో సత్కరించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుండటం అభినందనీయమని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందిస్తూ మరింత సేవ చేయాలని డాక్టర్ ప్రదీప్‌కుమార్‌ను వారు కోరారు. సమాజంలో వైద్య రంగంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ హుజూరాబాద్ మండల అధికార ప్రతినిధి తిరగమల్ల నాగార్జున, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎగ్గోజు ప్రసాద్, సైదాపూర్ మండల అధ్యక్షులు కుమార్, మాడుగుల రాజు, ఎర్ర రాజు, శనిగరం రవీందర్ , ఇల్లందుల రాజు, ఆకునూరి కుమారస్వామి, రమేశ్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య విలువలను చాటేలా ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.


Comments