విద్యార్థినులకు నగదు ప్రోత్సాహకాలు అందజేసిన చల్లా శివకృష్ణ .

విద్యార్థినులకు నగదు ప్రోత్సాహకాలు అందజేసిన చల్లా శివకృష్ణ .

ధర్మసాగర్,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): 

ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడంతో గ్రామానికి చెందిన యువకుడు చల్లా శివకృష్ణ వారిని ప్రోత్సహిస్తూ నగదు బహుమతులు అందించారు.
పదో తరగతి ఫలితాల్లో ప్రథమ ర్యాంక్ సాధించిన గీతికకు రూ.5,000, ద్వితీయ ర్యాంక్ సాధించిన జాహ్నవికి రూ.3,000 నగదు బహుమతులను అందజేశారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడం, ఉన్నత విద్య వైపు వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ బహుమతులు అందించినట్లు చల్లా శివకృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ననుబాల సోమక్క చంద్రమౌళి, ఉపసర్పంచ్ పెసరు శివ, మాజీ సర్పంచ్ పెసరు రమేష్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఫాతిమా మేరీ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .