కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
జనగామ, ఆగస్టు 15 (తెలంగాణ ముచ్చట్లు):
జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఇటీవల జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియమితులైన శాగంటి మణికి నియామక పత్రాన్ని అందజేశారు.
ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, యాదగిరిగుట్ట దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు లక్ష్మీనారాయణ నాయక్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా శాగంటి మణి మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతగా స్వీకరిస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో మరింత నిబద్ధతతో పనిచేస్తానని, ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు సాగుతానని తెలిపారు.తనకు ఈ అవకాశం కల్పించడంలో ముఖ్యపాత్ర పోషించిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి సింగపురం ఇందిర, జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Comments