15వ బెటాలియన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
సత్తుపల్లి, ఆగస్టు 15 (తెలంగాణ ముచ్చట్లు):
బి.గంగారంలోని 15వ ప్రత్యేక పోలీసు పటాలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం దేశభక్తి, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. పటాలపు కమాండెంట్ ఎన్. పెద్దబాబు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్ ఎన్. పెద్దబాబు మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. కుల, మత భేదాలకు అతీతంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. వారి ఆశయాల సాధనకు ప్రతి పౌరుడు తన వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పటాలంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది పిల్లలకు కమాండెంట్ ఎన్. పెద్దబాబు స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులు ఆనందోత్సాహాలతో స్వీట్లు స్వీకరించారు. కార్యక్రమంలో పటాలపు
సహాయ దళాధిపతి బి. వేణుగోపాల్ రెడ్డి, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Comments